Wednesday, April 17, 2024

Filmfare: ఫిల్మ్ ఫేర్ క‌వ‌ర్ పై వ‌రుణ్, చిల్ల‌ర్…

మెగా ప్రిన్స్, యంగ్ హీరో వరుణ్ తేజ్.. గట్టి హిట్ కోసం కొన్నేళ్లుగా ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వాలెంటైన్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. మార్చి 1వ తేదీ థియేటర్లలోకి రానుంది.

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా వరుణ్- మానుషి.. ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ పై దర్శనమిచ్చారు. ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై సందడి చేశారు. ఆ ఫొటోను మేకర్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆపరేషన్ వాలెంటైన్ జోడీతో ఈ లవ్ మంత్ మరింత మంత్రముగ్దులను చేస్తుందంటూ ట్వీట్ చేశారు. వరుణ్ తేజ్ స్టైలిష్ బ్లాక్ షూట్ లో కనిపించగా, మానుషి బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో అట్రాక్ట్ చేస్తోంది. కవర్ పేజీపై ఇద్దరూ అదరగొట్టేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీతోనే మానుషీ చిల్లర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతుండగా.. వరుణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి రుద్రగా వరుణ్ ఈ మూవీలో కనిపించగా.. రాడార్ ఆఫీసర్ గా మానుషి సందడి చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement