Friday, May 10, 2024

అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న ఆర్ సీబీ ఆట‌గాడు రజత్‌ పాటీదార్‌.

ఆర్సీబీ క్రీడాకారుడు రజత్‌ పాటీదార్‌ ఐపీఎల్‌-2022 సీజన్‌లో అద్భుతంగా రాణించాడు. బుధవారంనాడు లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో అజేయ శతకం(112)తో క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ శతకంతో రజత్‌ పాటీదార్‌ పలు రికార్డులు సాధించాడు. ప్లే ఆఫ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాట్స్‌మెన్‌గా పాటీదార్‌ గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో వృద్ధిమాన్‌ సాహా రికార్డును సమం చేశాడు. సాహా 49 బంతుల్లో సెంచరీ సాధించగా… పాటీదార్‌ కూడా 49 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన నాలుగో అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement