Friday, May 3, 2024

Sports | జనవరి 5న రంజీ ట్రోఫీ.. దేశవాలీ క్రికెట్​ సీజన్​ షెడ్యూల్​ రిలీజ్​

దేశవాళీ క్రికెట్‌ 2023-24 సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ వచ్చే ఏడాది జనవరి 5న మొదలవనుంది. అంతకంటే ముందే జూన్‌ 28 నుంచి దులీప్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా జరిగే ఈ పోటీల్లో ఆరు జట్లు టైటిల్‌ కోసం పోటీ పడనున్నాయి.

జూలై 16న టైటిల్‌ విజేత ఎవరో తేలిపోనుంది. ఆ తర్వాత దేవ్‌ధర్‌ ట్రోఫీ జూలై 24 నుంచి ఆగస్టు 4 వరకు జరుగుతుంది. ఆ వెంటనే ఇరానీ కప్‌ ప్రారంభం అవుతుంది. అక్టోబర్‌ 1 నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ పోటీలో రంజీ చాంపియన్స్‌ సౌరాష్ట్ర, రెస్టాఫ్‌ ఇండియా తలపడనున్నాయి. సయ్యద్‌ ముస్తాక్‌ టీ20 ట్రోఫీ అక్టోబర్‌ 16న మొదలై నవంబర్‌ 6న మగుస్తుంది. ఆ తర్వాత విజయ్‌ #హజారే ట్రోఫీనవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 15 వరకు జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement