Friday, May 17, 2024

19 నుంచి భద్రకాళి శాఖంబరి ఉత్సవాలు ప్రారంభం

వరంగల్‌ కల్చరల్‌, ప్రభన్యూస్‌: చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్‌ మహానగరం నందు స్వయం వ్యక్తమై పరవపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానం నందు తిథి మండల దేవతా యోజన పూర్వక శాకంబరీ నవరాత్ర మహోత్సవములు శోభకృత్‌ నామ సంవత్సర ఆషాడశుద్ధ సోమవారం తేదీ 19 నుండి ఆషాడ పౌర్ణమి 3 నుండి సోమవారం వరకు నిర్వహిస్తున్నట్లు- ఆలయ కార్య నిర్వహణ అధికారి శేషు భారతి తెలిపారు. జూన్‌ 19వ తేదీ ఉదయం సహస్ర కలిశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమై జులై 03 తేదీ అమ్మవారి శాకంబరి అలంకారంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement