Monday, April 29, 2024

ఇంగ్లండ్‌ పర్యటనకు రహానే దూరం.. గాయం కార‌ణంగా దూరంపెట్టిన సెలెక్ట‌ర్లు

కొల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ అజింక్యా రహానే ఐపీఎల్‌ 2022లో మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీనికితోడు అప్‌ కమింగ్‌ ఇంగ్లండ్‌ టూర్‌కు కూడా దూరం కానున్నాడు. గ్రేడ్‌ 3 హమ్‌స్ట్రింగ్‌ (స్నాయువు) గాయం కారణంగా అతన్ని రాబోయే ఇంగ్లండ్‌ పర్యటనకు సెలెక్టర్లు దూరం పెట్టనున్నారు. ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో అంతంత మాత్రంగా రాణించడంతో రహానేను కొన్ని మ్యాచ్‌లకు కోల్‌కతా జట్టు బెంచ్‌కు పరిమితం చేసింది. ఇక వరుస పరాజయాల అనంతరం.. కోల్‌కతా జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోగా..

మళ్లీ రహానే జట్టులోకి వచ్చాడు. అయినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. జూన్‌-జులై నెలలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రీ షెడ్యూల్డ్‌ టెస్టు మ్యాచ్‌ ఒకటి, టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ టూర్‌లో టెస్టు జట్టులో రహానే ఆడాల్సి ఉండగా.. గాయం కారణంగా దూరం కానున్నాడు. ఈ టూర్‌ రహానేకు ఎంతో కీలకం. ఇప్పటికే భారత్‌ జట్టులో పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ టెస్టు మ్యాచ్‌కు ఎంపికై రాణిస్తే.. తన స్థానాన్ని పదిలం చేసుకునే అవకాశం ఉండేది. కానీ గాయం రహానేను ఆటకు దూరం చేసింది. గాయం నుంచి కోలుకునేందుకు రహానేను నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి బీసీసీఐ పంపించనుంది. కాంట్రాక్‌ ్ట ఆటగాడు కావడంతో.. కోలుకోవడానికి అకాడమీలో చికిత్స, శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement