Saturday, May 4, 2024

పృథ్వీ షాలో 100 టెస్టులు ఆడే సత్తా ఉంది : కోచ్‌ పాంటింగ్‌..

టీమిండియా యువ ఆటగాడు, ఢిల్లి క్యాపిటల్స్‌ పృథ్వీ షాపై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ ప్రశంసలు కురిపించాడు. పృథ్వీ షాలో ఎంతో టాలెంట్‌ ఉందన్నారు. దూకుడుగా ఆడటంలో అతను ఏమాత్రం వెనుకాడటం లేదని తెలిపాడు. పృథ్వీ షాలో మంచి ప్రతిభ దాగి ఉందని, అతను టీమిండియా కోసం కనీసం 100 టెస్టు మ్యాచులు అయినా ఆడాలని కోరుకున్నాడు. పృథ్వీ షాను దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాడిలా మార్చాలనేదే తన కోరిక అని, కోచ్‌గా తనకు అదొక్కటే ఆనందాన్ని ఇస్తుందన్నారు. టీ20 లీగ్‌లో కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం అంటే.. జాతీయ జట్టుకు ఆటగాళ్లను తయారు చేయడంగానే తాను భావిస్తానని వెల్లడించాడు. గతంలో తాను ముంబై ఇండియన్స్‌కు హెడ్‌ కోచ్‌గా ఉన్నప్పుడు.. ఇదే చేశానని తెలిపాడు.

రోహిత్‌ శర్మ అప్పుడు యువ ఆటగాడు అని, హార్ధిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా అప్పటికి ఇంకా జట్టులోకి రాలేదన్నారు. ఇప్పుడు రోహిత్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడని, మిగిలిన వారు కీలక ఆటగాళ్లుగా మారిపోయారన్నారు. తాము కోచింగ్‌ ఇచ్చిన ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ ఆటగాళ్లుగా ఎదిగారనేది కోచ్‌లకు ఆనందాన్ని ఇస్తుందని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement