Monday, April 29, 2024

India | అథ్లెటిక్స్​లో నీర‌జ్ చోప్రా మ‌రో ఘ‌న‌త‌.. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 1 ర్యాంక్ సొంతం

అథ్లెటిక్స్‌లో భార‌త్‌కు తొలి ప‌సిడి ప‌తకం అందించిన‌ నీర‌జ్ చోప్రా మ‌రో ఘ‌న‌త సాధించాడు. జావెలిన్ త్రో ఆట‌కు వన్నె తెచ్చిన అత‌ను పురుషుల విభాగంలో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ప్ర‌పంచ అథ్లెటిక్స్ విడుద‌ల చేసిన ర్యాకింగ్స్‌లో 1455 పాయింట్ల‌తో నీరజ్ అగ్ర‌స్థానంలో నిలిచాడు. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ అండ‌ర్స‌న్ పీట‌ర్స్‌ను వెన‌క్కి నెట్టి మొదటి ర్యాంక్ ద‌క్కించుకున్నాడు. ఈ ఏడాదిని 25 ఏళ్ల ఈ జావెలిన్ త్రోయ‌ర్ ఘ‌నంగా ఆరంభించాడు. దోహాలో మే 5వ తేదీన ప్ర‌తిష్టాత్మ‌క డైమండ్ లీగ్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచాడు. తొలి ప్ర‌య‌త్నంలోనే అత‌ను జావెలిన్‌ను 88.67 మీట‌ర్ల దూరం విసిరాడు.

టాప్ 5లో ఎవ‌రెవ‌రున్నారంటే..

- Advertisement -
  1. నీర‌జ్ చోప్రా (భార‌త్) – 1455 పాయింట్లు
  2. అండ‌ర్స‌న్ పీట‌ర్స్ (గ్రెన‌డా) – 1433 పాయింట్లు
  3. జాకుబ్ వ‌డ్లెచ్ (చెక్ రిప‌బ్లిక్) – 1416 పాయింట్లు
  4. జులియ‌న్ వెబెర్ (జ‌ర్మ‌నీ) – 1385 పాయింట్లు
  5. అర్ష‌ద్ న‌దీం (పాకిస్థాన్) – 1306 పాయింట్లు

ఒలింపిక్స్‌లో ఒక‌ప్పుడు దేశానికి హాకీలో పసిడి ప‌త‌కాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వా బాక్సింగ్, రెజ్లింగ్, హాకీ, షూటింగ్ విభాగాల్లో యంగ్‌స్ట‌ర్స్ ప‌త‌కాలు సాధించారు. అయితే.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నీర‌జ్ సంచ‌ల‌నం సృష్టించాడు. జావెలిన్ త్రోలో బంగారు ప‌త‌కం గెలిచిన మువ్వ‌న్నెల జెండాను మురిపెంగా గుండెల‌కు హ‌త్త‌కున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement