Sunday, April 28, 2024

మిథాలీ రాజ్ అరుదైన రికార్డ్..

భారత మహిళా క్రికెట్ స్టార్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డును సృష్టించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ (10,273 పరుగులు)ను అధిగమించింది. కాగా, మిథాలీ రాజ్ సాధించిన ఈ విజయం, ఆపై దక్కిన అత్యధిక పరుగుల రికార్డుపై పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు. ఇక ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో హైదరాబాదీ మిథాలీ రాణించడంతో భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధితిలో సాగిన పోరులో ఇంగ్లండ్‌ నిర్ణీత 47 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్‌ 46.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.

ఇది కూడా చదవండి:మ్యాచ్‌కు ముందు శృంగారం చేయాలని టీమిండియా క్రికెటర్లకు సలహా

Advertisement

తాజా వార్తలు

Advertisement