Friday, May 10, 2024

Michelle Marsh : అస్ట్రేలియా జ‌ట్టుకు కొత్త కెప్టెన్

జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ప్యాట్ కమిన్స్ సారథ్యం వహించట్లేదని ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. 2023లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిష్, వన్డే వరల్డ్ కప్‌లో ఆసీస్ జట్టును కమిన్స్ గొప్పగా నడిపించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

రెండు ఫైనల్లో భారత్‌పై గెలిచి ట్రోఫీలు అందించాడు. కానీ టీ20 ఫార్మాట్‌లో కమిన్స్‌కు నాయకత్వ బాధ్యతలను ఆస్ట్రేలియా బోర్డు ఇవ్వాలనుకోవట్లేదు.
టీ20 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్లు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపాడు. ”టీ20 జట్టును మార్ష్ నడిపించిన తీరుపై సంతోషంగా ఉన్నాం. ప్రపంచకప్‌లో అతనే నాయకుడిగా భావిస్తున్నాం”అని మెక్‌డొనాల్డ్ తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టు కోచ్‌గానే కాకుండా సెలక్టర్‌గానూ మెక్‌డొనాల్డ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement