Monday, April 29, 2024

వరల్డ్ కప్ షూటింగ్ పోటీలకు మేఘన ఎంపిక

హైదరాబాద్ – జర్మనీ లో జరగనున్న జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలకు తెలంగాణ కు చెందిన మేఘన సాదుల ఎంపికైంది.. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మేఘన పోటీ పడనుంది.. ఇప్పటికే ఈ విభాగంలో అనేక పతకాలు సాధించి నేషనల్ సెలెక్టర్ల దృష్టి లో పడింది . జూనియర్ స్థాయిలో 25 మీటర్ల విభాగంలో ఆమె బంగారు పతక విజేత. ఈదే విభాగంలో సీనియర్ లతో పోటీ పడి కాంస్య పతకం సాధించింది.. 10 మీటర్స్ విభాగంలో సైతం పలు పతకాలను కైవసం చేసుకుంది.. ఆమె లోని ప్రతిభ ను గుర్తించిన ఇండియన్ రైఫిల్ అసోసియేషన్ జూనియర్ జాతీయ జట్టు సభ్యురాలిగా ఎంపిక చేసింది.. ప్రముఖ షూటర్ జస్పాల్ రాణా వద్ద శిక్షణ తీసుకుంటున్నది.. ఉస్మానియా యూనివర్సిటీ లో ఇంజినీరింగ్ చదువుతున్నది. ఆమె తండ్రి సారంగ పాణి ఎసిపి గా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement