Friday, May 3, 2024

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. సిరీస్ ప్రీక్వెల్ పై లేటెస్ట్ అప్డేట్

అమెరికన్ టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అభిమానులను ఎంతలా ఆకట్టుకుందో తెలసందే.. డేవిడ్ బెనాఫ్, డీబీ వీస్ ఈ సిరీస్ క్రియేట్ చేశారు. 2011లో మొదలైన ఈ సిరీస్.. 8 సీజన్లు, 73 ఎపిసోడ్లతో 2019లో ముగిసింది. కాగా, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇప్పుడీ హిట్ సిరీస్ ప్రీక్వెల్ రాబోతోంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రెజెంటేషన్ లో ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయడం విశేషం.

ఈ సిరీస్ కు ప్రస్తుతం ఎనైట్ఆఫ్ ద సెవెన్ కింగ్‌డమ్స్: ది హెడ్జ్ నైట్ (A Knight of the Seven Kingdoms: The Hedge Knight) అనే పేరు పెట్టారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టోరీ కంటే వందేళ్ల ముందు వెస్టెరోస్ కు చెందిన ఇద్దరు వీరుల కథే ఈ ది హెడ్జ్ నైట్. ఈ ప్రీక్వెల్ కు మార్టిన్ రైటర్ గా ఉండటంతోపాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గానూ ఉండనున్నాడు. మార్టిన్ ఇప్పటి వరకు మూడు నవలలు పబ్లిష్ చేశాడు. 1998లో ది హెడ్జ్ నైట్, 2003లో ది స్వోర్న్ స్వోర్డ్, 2010లో ది మిస్టరీ నైట్ అనే నవలలు రాశాడు.

ఆ మూడింటినీ కలిపి 2015లో ఎ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్‌డమ్స్ తీసుకొచ్చారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత వెస్టెరోస్ ఆధారంగా హెచ్‌బీవో క్రియేట్ చేస్తున్న మరో సిరీస్ ఇది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ను కూడా మార్టిన్ రాసిన ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. ఇదొక కల్పిత కథ. ఎసోస్ అనే ఖండంలోని వెస్టెరోస్ లోని ఏడు రాజ్యాల చుట్టూ తిరుగుతుంది. ఈ ఏడు రాజ్యాలకు చెందిన ఐరన్ థ్రోన్ కోసం ఎనిమిది కుటుంబాల మధ్య జరిగే యుద్ధాన్ని ఈ సిరీస్ లో చూపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement