Thursday, May 2, 2024

Marathon Race – రేపు భాగ్య‌న‌గ‌రంలో “క్రికెట్ గాడ్”

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రేపు హైదరాబాద్ రానున్నాడు. ఎన్ఈబీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో రేపు తెల్లవారుజామున జరగనున్న మారథాన్‌కు సచిన్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ మారథాన్‌లో మొత్తం 8 వేల మంది రన్నర్లు పాల్గొంటారు. మూడు విభాగాలుగా జరిగే ఈవెంట్‌లో ఉదయం 5.15 గంటలకు 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ ప్రారంభం అవుతుంది. ఆరున్నర గంటలకు 10కే, 7.45 గంటలకు 5కే రన్ ప్రారంభమవుతుంది. ‘రన్ ఏజ్‌లెస్.. రన్ ఫియర్‌లెస్’ థీమ్‌తో ఈ మారథాన్‌ను నిర్వహిస్తున్నారు.


ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్ అయిన సచిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారథాన్‌లో పాల్గొనేవారు వయసు గురించిన ఆలోచనలకు అతీతంగా ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. వయసును సంఖ్యకు పరిమితం చేయొద్దని పేర్కొన్నాడు. యవ్వనంలో ఉన్నప్పుడే కాదని, ఏ వయసులో అయినా ఫిట్‌నెస్ జర్నీని ప్రారంభించవచ్చని సూచించాడు. భారత్‌ను క్రీడలు ఇష్టపడే దేశం నుంచి క్రీడలను ఆడే దేశంగా మార్చేందుకు అన్ని వయసుల వారి భాగస్వామ్యం అవసరమని సచిన్ పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement