Sunday, April 28, 2024

French Open | సెమీస్‌లోకి లక్ష్య సేన్..

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో.. లక్ష్య సేన్ సెమీస్ కు చేరాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో సింగపూర్ ఆటగాడు లోహ్ కీన్ యూతో తలపడిన సేన్ తొలి సెట్ కోల్పోయినా తర్వాతి రెండు సెట్లలో విజయం సాధించాడు. దీంతో లక్ష్య సేన్ 19-21, 21-15, 21-13 స్కోరుతో సింగపూర్‌కు చెందిన లోహ్ కీన్ యూపై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు.

భారత స్టార్ డబుల్స్ జోడీ ఇప్పటికే సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇవ్వాల జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సుపాక్ జోమ్‌కో, కిట్టినుపాంగ్ కేడ్రెన్‌పై 21-19, 21-13తో వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. తర్వాతి మ్యాచ్‌లో దక్షిణ కొరియాకు చెందిన కాంగ్‌ మిన్‌ హ్యూక్‌, సియో సీయుంగ్‌ జేతో తలపడనున్నారు.

మహిళల డబుల్స్ విభాగంలో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ ద్వయం తమ క్వార్టర్‌‌ఫైనల్ మ్యాచ్‌లో చైనా జోడీ చెన్-జియాతో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement