Friday, October 4, 2024

Ban her from stadium | ఆమెను స్టేడియంలోకి రానీయొద్దు.. కోహ్లీ భార్య అనుష్కపై ట్రోలింగ్​

లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మను సోషల్ మీడియాలో ఆడిపోసుకుంటున్నారు. ఆమెను ట్యాగ్​ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఐదవ రోజు నాటకీయ పరిణామాల మధ్య భారత జట్టు కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియన్ బౌలర్లు తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు.

రెండో ఇన్నింగ్స్ లో 444 పరుగుల భారీ లక్ష్యాన్ని చేజ్​  చేయడానికి భారత్ బరిలోకి దిగింది. 4వ రోజు 164/3వికెట్ల  వద్ద ఆట ముగిసింది. కొంతమేరకు ఇది బాగానే ఉందనిపించింది. ఇక.. ఆఖరి రోజు ఆటతీరు మరీ దారుణంగా ఉందని, చాలా మంది నమ్మడం కష్టంగా ఉందంటున్నారు. ఎందుకంటే భారత బ్యాటర్లు పేక ముక్కల వలే ఒకరితర్వాత ఒకరు వికెట్లు కోల్పోతూ పెవిలియన్​ చేరుకున్నారు. 5వ రోజు మొదటి సెషన్‌లో భారత్ కేవలం 70 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి రెండో వరుస WTC ఫైనల్‌ను కోల్పోయింది.

ఫైనల్‌లో బ్యాట్, బాల్‌తో భారత జట్టు పేలవ ప్రదర్శన చేసిందని పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్​ అనలిస్టులు అంటుండగా.. కొంతమంది వికృత అభిమానులు మాత్రం అనుష్క శర్మను తప్పుపడుతూ ఈ చర్చలోకి లాగుతున్నారు. ఫైనల్‌కు హాజరైనందుకు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

https://twitter.com/joh_n_s_/status/1667858431573884928

ఆస్ట్రేలియా కెప్టెన్​ పాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టుపై.. భారత్ గెలవాలని కోరుతూ అనుష్క తన భర్త కోహ్లీని ఎంకరైజ్​ చేసేలా 5వ రోజు ఓవల్‌లోని స్టాండ్స్ లో కూర్చుంది. అయితే.. క్రికెట్​ లవర్స్​ మాత్రం ఆమెను బండ బూతులు తిరుడుతున్నారు. కోహ్లీ బాగా ఆడుతుంటే స్టేడియంలోకి ఎందుకొచ్చావ్​.. నీ వల్లే కోహ్లీ ఆడకుండా వికెట్​ పోగొట్టుకున్నాడని హేళన చేస్తున్నారు. ఇంకొందరైతే భారత్ మ్యాచ్​లు జరిగే సమయంలో అనుష్క శర్మను ఆయా స్టేడియాల వైపు రాకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement