Wednesday, May 15, 2024

Cricket | కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన‌ య‌శ‌స్వి జైస్వాల్..

యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ధర్మశాలలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టెస్టు మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ 655 పరుగులు చేయగా, తాజా మ్యాచ్‌లో ఎండ్యూరెన్స్ బౌలింగ్‌లో సింగిల్ తీసి జైస్వాల్ కోహ్లీని అధిగమించాడు.

ఇంగ్లాండ్ పై ఓ టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్లు..

య‌శ‌స్వి జైస్వాల్ – 9 ఇన్నింగ్స్‌లు – 656* ప‌రుగులు (2024లో)
విరాట్ కోహ్లీ – 8 ఇన్నింగ్స్‌లు – 655 ప‌రుగులు (2016-17లో)
రాహుల్ ద్ర‌విడ్ – 6 ఇన్నింగ్స్‌లు – 602 ప‌రుగులు (2002లో)
విరాట్ కోహ్లీ – 10 ఇన్నింగ్స్‌లు- 593 (2018లో)

ఇక ఇవ్వాల్టి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 218 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో జాక్‌క్రాలీ (79) అర్ధ‌శ‌త‌కం బాదాడు. జానీ బెయిర్ స్టో (29), బెన్‌డ‌కెట్ (27), జోరూట్ (26), బెన్‌ఫోక్స్ (24)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. భార‌త బౌల‌ర్లలో కుల్దీప్ యాద‌వ్ ఐదు వికెట్లతో చెల‌రేగ‌గా.. ర‌విచంద్ర‌న్ అశ్విన్ నాలుగు, ర‌వీంద్ర జ‌డేజా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement