Wednesday, May 15, 2024

IPL | జైశ్వాల్​ పోరాటం వృథా.. ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ముంబయి

ముంబయి ముందు రాజస్థాన్‌ భారీ టార్గెట్​ పెట్టినప్పటికీ, ఆ జట్టు పోరాడి విజయం సాధించింది. బౌలింగ్​లోనూ రాజస్థాన్​ కట్టుదిట్టంగా ఆడినప్పటికీ ముంబయి ఆఖరి ఓవర్​లో హిట్​ చేసింది. దీంతో నిర్ణీత ఓవ‌ర్లలో టార్గెట్ రీచ్ అయి.. విజయం సాధించింది. దీంతో రాజస్థాన్​ 06 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ముంబ‌యి ఇండియన్స్ ముందు 213 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. ముంబ‌యితో ఇవ్వాల (ఆదివారం) రాత్రి జ‌రిగిన‌ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఇక‌.. ఐపీఎల్ టోర్నీలో ఇది 1000వ మ్యాచ్ కావ‌డం, ముంబ‌యి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టిన రోజు కావ‌డంతో ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. అంతేకాకుండా రోహిత్ శర్మ 150వ మ్యాచ్ కూడా ఆడడం మ‌రింత స్పెష‌ల్ అనుకోవాలి..

కాగా, రాజస్థాన్ రాయల్స్ తరుపున ఓపెనర్‌గా దిగిన యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేశాడు. సహచర ఓపెనర్ జోస్ బట్లర్, సారధి సంజూ శాంసన్, పడిక్కల్, హోల్డర్, సిమ్రాన్, ధ్రువ్ జురేల్ పెవిలియన్ దారి పట్టినా.. యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడాడు.  చివరి ఓవర్ వరకు క్రీజులో నిలకడగా బ్యాటింగ్ చేసిన యశస్వి జైస్వాల్ 124 పరుగుల వద్ద చివరి ఓవర్ లో అర్షద్ ఖాన్ బౌలింగ్ లో నాలుగో బంతికి ఔటయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ 212 పరుగులు చేసింది.

ముంబ‌యి బ్యాట‌ర్ల‌లో సూర్య కుమార్ (55), కెమరూన్​ గ్రీన్​ (44) మినహా.. రోహిత్​ శర్మ (3), ఇషాన్​ కిషన్​ (28) పరుగులు మాత్రమే చేశారు.  దీంతో టార్గెట్​ ఛేదనలో ముంబయి ఉత్సాహంగా ఆడలేకపోయింది. ఇక చివరి ఓవర్​లో తిలకవర్మ29, టిమ్​ డేవిడ్​45 దంచికొట్టి ముంబయికి విజయం చేకూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement