Thursday, November 7, 2024

Sports | జాతీయ హ్యాండ్‌బాల్ సెక్రటరీగా జగన్‌మోహన్‌రావు

వివాదాల సుడిగుండం నుంచి జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం బయటపడింది. అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం (ఐహెచ్‌ఎఫ్‌), ఆసియా హ్యాండ్‌బాల్‌ సంఘం (ఏహెచ్‌ఎఫ్‌) మద్దతు ఇచ్చిన హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఏఐ)కే భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కూడా జైకొట్టింది. హెచ్‌ఎఫ్‌ఐను పక్కనపెట్టి తెలంగాణ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మో#హన్‌ రావు సారథ్యంలోని హెచ్‌ఏఐకే ఐఓఏ గుర్తింపు ఇచ్చి, రెండు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చింది. హెచ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడిగా దిగ్విజయ్‌ చౌతాలా, ప్రధాన కార్యదర్శిగా జగన్‌మో#హన్‌రావు, కోశాధికారిగా తేజ్‌రాజ్‌ సింగ్‌ను ఐఓఏ ప్రకటించింది.

హ్యాండ్‌బాల్‌ అభివృద్ధే ఏకైక అజెండా
భారత ఒలింపిక్‌ సంఘం నుంచి హెచ్‌ఏఐకు గుర్తింపు రావడం పట్ల జగన్‌మోహన్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క రాష్ట్ర సంఘం, నిజాయితీ, ప్రతిభావంతులైన క్రీడాకారుల విజయంగా జగన్‌మోహన్‌ రావు అభివర్ణించారు. గత రెండేళ్లగా తన నాయకత్వంపై విశ్వాసం ఉంచి హెచ్‌ఏఐతో ప్రయాణం చేసిన హ్యాండ్‌బాల్‌ కుటుంబ సభ్యులందరికీ కతజ్ఞతలు తెలిపారు.

ఆసియా క్రీడలు లక్ష్యం
త్వరలో జరగబోయే ఆసియా క్రీడల్లో భారత్‌ మెరుగైన ప్రదర్శన చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని జగన్‌మో#హన్‌ు చెప్పారు. వచ్చే నేషనల్‌ గేమ్స్‌లో తిరిగి హ్యాండ్‌బాల్‌ను ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. వచ్చే నెలలో జరగాల్సిన ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) యథావిధిగా జరగనుందని, ఈ లీగ్‌తో దేశంలో హ్యాండ్‌బాల్‌కు ఆదరణ రెట్టింపు కానుందని అన్నారు. సమీప భవిష్యత్‌లోనే మ#హళల హ్యాండ్‌బాల్‌ లీగ్‌ కూడా నిర్వ#హంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement