Sunday, May 5, 2024

మరో మూడు రోజుల్లో ఐపిఎల్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) 2023 వేలం మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఇప్పటికే వేలంలో ఉన్న 405 మంది ఆటగాళ్ల తుది జాబితాను ఐపిఎల్‌ పాలక మండలి వెల్లడించింది. ఈ వేలంలో పాల్గొంటున్న భారత మాజీ లెగ్‌ అమిత్‌ మిశ్రా స్పందించాడు. ఈ సారి ఐపిఎల్‌ వేలంలో ఏదో ఒక ఫ్రాంచైజీ నన్ను తీసుకుంటుందనే నమ్మకం నాకుంది అని మిశ్రా వెల్లడించాడు.

ఈ ఏడాది ఐపిఎల్‌ వేలంలో పాల్గొంటున్న పెద్ద వయస్కుడిగా అమిత్‌ మిశ్రా గుర్తింపు సాధించాడు. ఈ టీ 20 లీగ్‌లో అత్యధికంగా 166 వికెట్లు తీసిన భారత బౌలర్‌ తనే. అయితే పోయిన ఏడాది వేలంలో అతనికి చుక్కెదురైంది. ఏ ఫ్రాంచైజీ కూడా ఈ స్పిన్నర్‌ను కొనేందుకు ఆసక్తి చూపించలేదు. అయినా కూడా మిశ్రా నిరాశ చెందలేదు. ఈ సీజన్‌ వేలంలో కనీస ధర రూ 50 లక్షలకు పేరు రిజిస్టర్‌ చేసుకున్నాడు. మళ్లి ఐపిఎల్‌ సీజన్‌లో ఆడాలనే అమిత్‌ మిశ్రా కల నెరవేరనుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

గతంలో దక్కన్‌ చార్జర్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లిd క్యాపిటల్స్‌ జట్ల తరపున మిశ్రా ఆడాడు. మూడుసార్లు (2008, 2011,2012) సీజన్‌లో హ్యట్రిక్‌ తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపిఎల్‌ 2023 వేలం డిసెంబర్‌ 23వ తేదీన కొచ్చిలో ప్రారంభం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement