Monday, April 29, 2024

Injured – జట్టు నుంచి హర్డిక్ పాండ్యా ఔట్…ప్రసిద్ధి కృష్ణ ఇన్

టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయం నుంచి కోలుకోలేక పోవడంతో స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ నుంచి దూరమయ్యాడు. పూణెలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చీలమండ గాయంతో హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. ఆ తరువాత భారత్ ఆడిన మ్యాచ్ లకు హార్దిక్ దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిన తరువాత గాయం నుంచి అతను కోలుకుంటున్నాడని వార్తలు వచ్చాయి..హార్దిక్ పాండ్య గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడని, లీగ్ దశలో మ్యాచ్ లకు జట్టుకు అందుబాటులో లేకపోయినప్పటికీ.. సెమీ ఫైనల్ మ్యాచ్ లకు తుదిజట్టులో పాండ్య చేరుతాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

తాజాగా, హార్దిక్ గాయం నుంచి కోలుకోవటం కష్టమని భావించిన టీం మేనేజ్ మెంట్ వన్డే వరల్డ్ కప్ నుంచి అతనికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో టోర్నీలోని మిగిలిన మ్యాచ్ లకు హార్దిక్ దూరమైనట్లు ఐసీసీ ధ్రువీకరించింది. అతని స్థానంలో యువ పాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ భారత్ జట్టులో చేరనున్నాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కు ప్రసిద్ధ్ కృష్ణ అందుబాటులో ఉండనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement