Saturday, May 4, 2024

తాహిర్ నయా రికార్డ్

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌ లో జరుగుతున్నహండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ లో హ్యట్రిక్ తో దుమ్ముదులిపాడు తాహిర్. బర్మింగ్‌హమ్‌ ఫొనిక్స్‌, వెల్ష్‌ఫైర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఇమ్రాన్‌ తాహిర్‌ మెరుపులతో బర్మింగ్‌హమ్‌ కీలకదశలో విజయాన్ని అందుకొని టేబుల్‌ టాపర్‌గా నిలిచింది.  ఖయాస్‌ అహ్మద్‌, మాట్‌ మిల్నెస్‌, డేవిడ్‌ పైన్‌ రూపంలో హ్యాట్రిక్‌ను అందుకున్న తాహిర్‌ అంతకముందు గ్లెన్‌ ఫిలిప్స్‌, లూస్‌ డూ ప్లూయ్‌లను కూడా ఔట్‌ చేసి మొత్తం ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.తొలిసారి జరుగుతున్న  ఈ టోర్నీలో హ్యాట్రిక్‌తో మెరిసిన తాహిర్‌.. ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. టోర్నీలో అరుదైన ఫీట్‌ అందుకున్న తొలి బౌలర్‌గా తాహిర్‌ రికార్డులకెక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement