Saturday, May 18, 2024

ఇండియన్‌ రేసింగ్‌ ఫెస్టివల్‌ కోసం.. బ్లాక్‌ బర్డ్స్‌ ఫ్రాంచైజీకి దేవరకొండ మద్దతు

హెదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : ఇండియన్‌ మోటర్‌స్పోర్ట్స్‌ కంపెనీ, ఆర్‌పీపీఎల్‌ (రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) తమ ఫ్రాంచైజీ మోడల్‌ ఆధారిత ఇండియన్‌ రేసింగ్‌ ఫెస్టివల్‌ను ప్రకటించింది. సుప్రసిద్ధ నటుడు, వ్యాపారవేత్త విజయ్‌ దేవరకొండ ఇప్పుడు హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ ఫ్రాంచైజీకి మద్దతునందించ నున్నట్లు వెల్లడించింది. ఈ ఫెస్టివల్‌ నవంబర్‌ 11వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.

నటుడు, వ్యాపారవేత్త విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ లీగ్‌ లో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నానన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా ప్రేమికులకు నూతన అవకాశాలను ఇది అందించనుందన్నారు. భారతదేశంలో రేసింగ్‌కు ఇప్పుడు ప్రత్యేక స్థానముందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement