Friday, July 26, 2024

Cricket: సౌథాఫ్రికాతో వన్డే సిరీస్.. రోహిత్ ఔట్! కెప్టెన్‎గా కేఎల్ రాహుల్.. వైస్ కెప్టెన్‎ ఎవరో తెలుసా?

దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్షన్ కమిటీ టీమిండియా (Team India) జట్టును ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇటీవల వన్డే కెప్టెన్‎గా ఎంపికయిన రోహిత్ శర్మ (Rohit Sharma) గాయం కారణంగా ఈ వన్డే సిరీస్‎కు దూరమయ్యాడు. దీంతో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ (KL Rahul )ను తాత్కాలిక కెప్టెన్‎గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను వైస్ కెప్టెన్‎గా ఎంపిక సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

బీసీసీఐ ప్రకటించిన 18 మంది సభ్యుల బృందంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో అదరగొట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer), రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad)లు ఉన్నారు. ఈ మ‌ధ్య‌ కాలంలో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా వెటరన్‌ ఆఫ్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (R Ashwin)కు చోటు దక్కింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఫిట్‌గా లేకపోవడంతో వారిద్ద‌రు ఈ వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది. ఇక‌.. శిఖర్ ధావన్ (Shikhar Dhawan), శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ జట్టులోకి వచ్చారు. జనవరి 19 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి.

భారత వన్డే జట్టు ఇదే..
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ కృష్ణ, శర్దూల్ ఠాకుర్, మొహ్మద్ సిరాజ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement