Saturday, December 7, 2024

శివ‌కాశి బాణ‌సంచా ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు – న‌లుగురు మృతి

కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టిన వేళ త‌మిళ‌నాడులోని విరుద్ న‌గ‌ర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివ‌కాశిలోని బాణ‌సంచా ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మ‌ర‌ణించారు. ప‌లువురికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పేలుడు తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉందని స‌మాచారం. మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాప‌క సిబ్బంది ప్ర‌య‌త్నిస్తున్నారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement