Saturday, April 27, 2024

చాంగ్వాన్‌ షూటింగ్‌ వరల్డ్‌ కప్ భారత్‌కు మరో స్వర్ణం..

కొరియాలోని చాంగ్‌వాన్‌ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌ రైఫిల్‌/పిస్టోల్‌/షాట్‌గన్‌ టోర్నీలో భారత్‌ షూటర్లు మెహులీ ఘోష్‌, సాహు తుషార్‌ మణ జోడీ స్వర్ణం చేజిక్కించుకుంది. 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ గోల్డ్‌ మెడల్‌ పోటీలో హంగేరీకి చెందిన ఈస్టర్‌ మెస్‌జారోస్‌- ఇస్టావన్‌ పెనీపై 17-13 తేడాతో విజయం సాధించింది. చాంగ్వాన్‌ ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ రేంజ్‌లో బుధవారం జరిగిన ఐదు పోటీల్లోనూ భారత్‌కు సత్ఫలితాలు వచ్చాయి. మెన్స్‌ విభాగంలో భారత బృందం వెండి పతకాన్ని చేజిక్కించుకుంది.

10మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో శివ నార్వల్‌- పాలక్‌ బ్లిట్జ్‌డ్‌ 16-0తో తేడాతో విజయం సాధించి, రజత పతకం కైవసం చేసుకుంది. పతకాల పట్టికలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. భారత్‌ రెండు స్వర్ణాలు, ఒక వెండి, ఒక రజతం పతకాలు సాధించింది. టోర్నీ మూడో రోజే 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మెన్‌ కాంపిటీషన్‌లో అర్జున్‌ బబుతా స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఇక సెర్బియా 3 గోల్డ్‌ పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, చైనా, భారత్‌ సమానస్థాయిలో పతకాలు సాధించి, రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఒలింపిక్‌ ఈవెంట్స్‌లోనూ భారత్‌ రెండు స్వర్ణాలు సాధించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement