Sunday, April 28, 2024

ఆస్ట్రేలియా ఓపెన్‌కు కరోలినా దూరం

స్పెయిన్‌: వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌కు వింబుల్డన్‌ ఫైనలిస్ట్‌ కరోలినా ప్లిస్కోవా దూరమైంది. ఈ విషయాన్ని ఆమె భర్త, మేనేజర్‌ మిచాల్‌ గురువారం మీడియాకు తెలిపాడు. కరోలినా స్పెయిన్‌లో శిక్షణ శిబిరంలో గాయపడిందని మిచాల్‌ వెల్లడించాడు. శిక్షణలో ఆమె ముంజేయి విరగడంతో ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాడు.

చికిత్స నుంచి కోలుకునేందుకు దాదాపు నాలుగు వారాలు పడుతుందని వివరించాడు. మరోవైపు కరోలినా కూడా మాట్లాడుతూ తనకు ఇష్టమైన ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడలేకపోతున్నా అని, దురదృష్టవశాత్తు టెన్నిస్‌కు కొంతకాలం దూరంగా ఉండనున్నట్లు 29ఏళ్ల కరోలినా ప్లిస్కోవా ఫేస్‌బుక్‌లో తెలిపింది. 2016లో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరుకున్న ప్లిస్కోవా ఇంకా గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకోలేదు. ప్రపంచ నంబర్‌ 4కరోలినా ఈ ఏడాది వింబుల్డన్‌ ఫైనల్లో ఆష్లీ బార్టీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement