Sunday, April 28, 2024

KKR : కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ వ‌చ్చేశాడు…

కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌..ఐపీఎల్‌ కోసం కోల్‌కతాలో అడుగుపెట్టాడు. వెన్నునొప్పి గాయంతో లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముందన్న వార్తలను తోసిపుచ్చుతూ అయ్యర్‌..కోల్‌కతా నైట్‌రైడర్స్‌ క్యాంప్‌లో అడుగుపెట్టాడు. కెప్టెన్‌ అయ్యర్‌ వచ్చేశాడంటూ కేకేఆర్‌ తమ సోషల్‌మీడియాలో ఫొటోలు పోస్ట్‌ చేసింది.

గాయం కారణంగా గత సీజన్‌కు పూర్తిగా దూరమైన అయ్యర్‌ ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ గాయంతో చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. దీనికి తోడు రంజీ ట్రోఫీలో క్వార్టర్స్‌లో ఆడలేకపోయిన ఈ ముంబైకర్‌..సెమీస్‌, ఫైనల్లో జట్టులోకి వచ్చాడు. కాగా, లీగ్‌ తొలి మ్యాచ్‌లో ఈ నెల 23న కోల్‌కతా, హైదరాబాద్‌తో ఆడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement