Saturday, July 27, 2024

IPL 2024 | 19న ఐపీఎల్ 2024 మినీ వేలం.. ప్రకటించిన బీసీసీఐ

దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 వేలం తేదీని బీసీసీఐ అధికారికంగా అనౌన్స్ చేసింది. దుబాయ్‌ వేదికగా డిసెంబర్ 19వ తేదీన ఈ వేలం జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, విదేశాలలో ఐపీఎల్ వేలం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ వేలంలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఏకంగా 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు.

అన్ని జట్లలో కలిపి 77 ఖాళీలు ఉండగా.. అందులో 30 విదేశీ క్రికెటర్ల స్థానాలు. ఈ వేలంలో ఆసీస్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఆటగాళ్లతో పాటు 3 టీమిండియా ఆట‌గాళ్లు ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి ఏడుగురు ఆట‌గాళ్లు ఉండగా, ద‌క్షిణాఫ్రికా నుంచి ముగ్గురు వేలంలో తమ పేర్లను రిజిష్ట‌ర్ చేసుకున్నారు.

ఐపీఎల్ 2024 జట్ల పూర్తి జాబితా ఇదే…

- Advertisement -

ప్రాంచైజీలు తమ జట్లలోని ఆటగాళ్లను ప్రకటిస్తున్నాయి. మినీ వేలానికి ఒక వారం ముందు డిసెంబర్ 12న ట్రేడ్ విండో ముగియనుంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌ పగ్గాలు అందుకున్న హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ఫలితంగా.. ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రేడింగ్ చేసింది.

నవంబర్ 26న చివరి రోజున జట్లు మొత్తం 173 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. దాంతో గుజరాత్ టైటాన్స్ గరిష్టంగా రూ.38.15 కోట్లతో వేలానికి వెళ్లనుండగా, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 31.4 కోట్లు, రూ. 28.95 కోట్లతో వేలానికి వెళ్లనున్నాయి. నివేదికల ప్రకారం, 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను నిర్ధారించిన తర్వాత ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement