Monday, April 29, 2024

Asian Games – షూటింగ్ భార‌త్ కు మ‌రో మెడ‌ల్… మొత్తం అయిదు ప‌త‌కాల‌తో టీమ్ ఇండియా జోరు…

అసియా గేమ్స్ 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో భార‌త్ కాంస్య ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకుంది.. ఈ విభాగంలో పోటీ ప‌డిన షూట‌ర్ ర‌మిత మూడో స్థానంలో నిలిచి బ్రోంజ్ మెడ‌ల్ ను త‌న ఖాతాలో వేసుకుంది.. అంత‌కు ముందు 10 మీట‌ర్ల టీమ్ ఈవెంట్ లో సిల్వ‌ర్ మెడ‌ల్ ను సాధించింది. దీంతో ర‌మిత షూటింగ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ప‌త‌కాల‌ను సాధించింది.. కాగా, భార‌త్ నేడు రోయింగ్ విభాగంలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ప‌త‌కాల‌ను సాధించింది.

నేడు జ‌రిగిన షూటింగ్, రోయింగ్ విభాగాల‌లో మొత్తం అయిదు మెడ‌ల్స్ సాధించ‌గా అందులో మూడు వెండి, రెండు కాంస్య ప‌త‌కాలున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement