Thursday, May 16, 2024

IND-ENG 3rd Test | గాయాలతో సీనియర్ల గైర్హాజరీ.. యువ ఆటగాళ్లతో బరిలోకి భారత్ !

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మ‌రో ఆస‌క్తిక‌ర‌పోరుకు సిద్దమైంది టీమిండియా. రేపటినుంచి (ఫిబ్రవరి 15–గురువారం) రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఇరు జట్లు రాజ్‌కోట్ చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టాయి.

కాగా, ఈ టెస్టులో సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది భారత జట్టు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ ఈ సిరీస్ మొత్తానికి దూరమవ్వగా.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఇక రాహుల్ స్థానంలో జట్టులోకి దేవదత్ పడిక్కల్ వచ్చాడు. ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ ఒక్కడికే 56 టెస్ట్‌లు ఆడిన అనుభవం ఉండగా.. గిల్ 22 టెస్ట్‌లు ఆడాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా కనీసం 10 మ్యాచ్‌లు ఆడలేదు.

కుర్రాళ్లు అరంగేట్రం..

రోహిత్, జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. నాలుగో స్థానంలో గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన రజత్ పటీదార్ ఆడనుండగా.. ఐదో స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఆరోస్థానంలో యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ అరంగేట్రం చేయనున్నాడు.

- Advertisement -

తొలి రెండు మ్యాచ్‌ల్లో కేఎస్ భరత్ విఫలమవడంతో అతనిపై టీమ్‌మేనేజ్‌మెంట్ వేటు వేసే అవకాశం ఉంది. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా, 8వ స్థానంలో అశ్విన్ ఆడనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తారా? లేక అక్షర్ పటేల్‌ను కొనసాగిస్తారా? అనేది చూడాలి. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లు ఆడనున్నారు.

భారత తుది జట్టు (అంచనా)..

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌, రజత్ పటీదార్/సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, కేఎస్ భరత్/ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/ఆకాశ్ దీప్.

Advertisement

తాజా వార్తలు

Advertisement