Monday, April 29, 2024

AP – ర‌థ‌స‌ప్త‌మికి అంతా రెడీ

పశ్చిమ ప్రకాశం (ప్రభన్యూస్ ప్రతినిధి) :తిరుమల తిరుపతి తరహాలో ప్రకాశం జిల్లా మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథసప్తమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మార్కాపురం పట్టణ నడిబొడ్డున వేంచేసియున్న లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలు ఈనెల 16న శుక్రవారం ఉదయం 5.30 గంటలకు సూర్య ప్రభ వాహనంతో ప్రారంభం అవుతాయి.

ఉదయం 9 గంటలకు శేష వాహనం, ఉదయం 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం ఒంటిగంటకు హనుమంత వాహనం, మధ్యాహ్నం రెండు గంటల నుంచి చక్రస్నానం, మధ్యాహ్నం మూడు గంటలకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం ఐదు గంటలకు రజత రథోత్సవం, రాత్రి 8.00లకు చంద్రప్రభ వాహనాల్లో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామినాలుగు మాడవీధుల్లో విహరించనున్నారు. ప్రత్యేకించి రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథసప్తమి సేవా సంఘం ఏర్పాటయింది.

ఊరంతా సందడే సందడి

రథసప్తమి పర్వదినం రోజున జన సందడే సందడి. జనప్రవాహం పరవళ్లు తొక్కుతుంది. స్వామి వాహన సేవల సందడిలో జనం జాతర కనిపిస్తుంది. కోలాటం బృందాలు, కేరళ డప్పు నృత్యాలు , చెక్క భజన, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా నిర్వహించే వాహనం సేవలను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. భక్తుల సేవ కోసం మార్కాపురం పట్టణంలోని వివిధ సేవా సంఘాలు అన్న ప్రసాదం, తాగునీరు, మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తారు

స్థల పురాణం:

- Advertisement -

కృతయుగంలో కేశి అనే రాక్షసుడు అరణ్యంలో మునుల తపస్సుకు విఘ్నం కలిగించి, బాధించాడు. ఒకానొక సమయంలో శమీ వనం వద్దకు వచ్చిమార్కండేయ మహర్షుల తపస్సుకు విఘ్నం కలిగించాడు. అప్పుడుశ్రీ మహా విష్ణుమూర్తికి మార్కండేయ మహర్షి తపస్సు చేయగా… శ్రీ మహా విష్ణుమూర్తి ప్రత్యక్షమై కేశి అనే రాక్షసుడిని తన శేషచక్రంతో వధించి కేశవ స్వామి నామధేయంతోశ్రీ మహా విష్ణుమూర్తి వెలిసి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామిగా విలసిల్లారు. కలియుగంలో చెన్నకేశవ స్వామికి మారి కమ్మ మారికయ్య అనే గొల్లకాపరి స్వామికి గర్భాలయం నిర్మించారు. అందుకే ఈ గ్రామం మారికాపురిగా కాలానుగుణంగా మార్కాపురం గా మారింది. ధనుర్మాసంలో సూర్యకిరణాలు స్వామి పాదాలను స్పర్శిస్తాయి. మహా మండప ప్రాకారంపై రాతి ఆర్చి నిర్మాణం ఈ దేవాలయంలో మరో విశేషం. దేవాలయం ఎత్తైన గాలిగోపురం సుమారు పది కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement