Sunday, May 5, 2024

45th Match: లక్నో పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే

పీఎల్ 2023లో బుధవారం డబుల్ హెడర్ మ్యాచులు జరుగుతున్నాయి. మొదటి పోరులో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో లక్నో పై సీఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దీంతో ఈ మ్యాచ్ కు కృనాల్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. ఇక జట్టులోకి క్వింటన్ డికాక్ వచ్చాడు. కాగా.. పంజాబ్ పై 250 కు పైగా చేసిన రాహుల్ సేన బెంగళూరుపై 120కు పైగా టార్గెట్ ఛేదించలేకపోయింది. అందుకే ఈ పోరు అత్యంత కీలకం! ఈ స్టేడియం పిచ్లు అంచనాలకు అందడం లేదు. దాంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్య పెద్ద ఇన్నింగ్సులు ఆడాలి. మిడిలార్డర్ భారం స్టాయినిస్, నికోలస్ పూరన్పై ఉంది. కైల్ మేయర్స్, డికాక్ లు పవర్ ప్లే మొత్తం ఆడేలా జాగ్రత్తపడాలి. బౌలింగ్ పరంగా ఇబ్బందులేమీ లేవు. ఇండియన్, ఫారిన్ ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. రవి బిష్ణోయ్, గౌతమ్, పాండ్య, మిశ్రా స్పిన్ బాగుంది

చైన్నై సూపర్ కింగ్స్ సైతం చివరి మ్యాచులో ఓటమి పాలైంది. పంజాబ్ కింగ్స్ చెపాక్లో 200 కు పైగా టార్గెట్ ను ఆఖరి ఓవర్లో ఛేజ్ చేసింది. అయితే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బలంగా ఉంది. డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ లో ఒకరు కాకుంటే మరొకరు దూకుడుగా ఆడుతున్నారు. భారీ భాగస్వామ్యాలు అందిస్తున్నారు. అజింక్య రహానె సైతం ఫామ్లోనే ఉండటం ఫ్లెక్సిబిలిటీ పెంచింది. మిడిలార్డర్లో శివమ్ దూబె, రవీంద్ర జడేజా దంచికొడుతున్నారు. అంబటి రాయుడు ఇంకా సెట్టవ్వలేదు. మొయిన్ అలీ ఫర్వాలేదు. ఎంఎస్ ధోనీ దొరికినప్పుడు బాదేస్తున్నాడు కానీ మిగతా మ్యాచులో అలా ఉండటం లేదు. బౌలింగ్ పరంగా సీఎస్కే ఇబ్బంది పడుతోంది. అనుభవం లేని కుర్ర పేసర్లు ఒత్తిడికి గురవుతున్నారు. దేశ్పాండే వికెట్లు అందిస్తున్నా ప్రెజర్ ఫీలవుతున్నాడు. పతిరన బౌలింగ్ యాక్షన్ బాగుంది. స్పిన్ పరంగా సీఎస్కే ఫర్వాలేదు. పేస్ బౌలింగ్ విభాగంలోనే క్లిక్ అవ్వడం లేదు. రెండు జట్లు 10 పాయింట్లతో ఉండటంతో గెలిచిన వాళ్లు 12 పాయింట్లతో రెండో ప్లేస్కు చేరుకుంటారు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, జయదేవ్ ఉనద్కత్, రొమారియో షెపర్డ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement