Thursday, April 25, 2024

Kolkata Knight Riders : 24 కోట్ల మిచెల్ స్టార్క్ కు చుక్క‌లు…

చుక్క‌లు… ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం రాత్రి సన్​రైజర్స్ హైదరాబాద్​​, కోల్​కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం మనకి తెలిసిందే. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరికి విజయం కోల్​కతా వైపు నిలిచింది. కాకపోతే ఈ మ్యాచ్ ​లో మాత్రం సన్​రైజర్స్ హైదరాబాద్​ కాస్త గట్టిగానే పోరాడింది.

- Advertisement -

ఎంత ఆడిన రోజు మంది కానప్పుడు చివరి 5 బంతుల్లోనే మ్యాచ్ గమనం మారిపోయి విజయం కోల్​కతాకు వరించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టు బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లకు చివరి వరకు చుక్కలు చూపించారు.

ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు ఆసీస్ స్టార్ పేసర్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టు బ్యాటర్లు బంబేలెత్తించారు. అతడిని టార్గెట్ చేసినట్లుగా ఓ ఆట ఆడేసుకున్నారు సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టు బ్యాటర్లు. ఈయనను ఐపీఎల్-2024 మినీ వేలంలో ఏకంగా రూ.24.75 కోట్ల భారీ ధరకు కోలక్​కతా సొంతం చేసుకుంది.
నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ తన 4 ఓవర్లు బౌలింగ్ వేయగా.. 53 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ ను అందిచలేకపోయాడు. టీం మొత్తం బౌలర్స్ లో అత్యధిక ఎకానమీ రేట్ ను మిచెల్ స్టార్క్ ప్రదర్శనకే కలంకం తెచ్చేలా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement