Thursday, May 2, 2024

కోహ్లీకి లిప్ కిస్.. వైర‌ల్ గా వీడియో

విరాట్ కోహ్లీకి లిప్ కిస్ ఇచ్చింది ఓ యువ‌తి. ఏంటీ షాక్ అయ్యారా..ఇక్క‌డ విష‌యం ఏంటంటే కోహ్లీ మైన‌పు విగ్ర‌హాన్ని హ‌గ్ చేసుకుని ఇలా కిస్ చేసింది ఓ యువ‌తి.ఇప్పుడా వీడియో వైర‌ల్ అవుతోంది. ఢిల్లీలో ఓ మహిళా ఫ్యాన్ కనబర్చిన ప్రేమకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విరాట్ మైనపు బొమ్మను వాటేసుకొని, లిప్ కిస్ చేసింది ఆ యువతి. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆ యువతి ముద్దుపెట్టుకుంటుండగా.. ఆ మధుర క్షణాలను ఆమె స్నేహితురాలు సెల్ ఫోన్లో బంధించింది. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో 2018 జూన్‌లో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 200లకి పైగా కొలతలు, ఫోటోల సాయంతో నిర్వాహకులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. జీవం ఉట్టి పడుతున్నట్లుగా ఉన్న ఈ మైనపు విగ్రహం ఈ మ్యూజియంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.యువతి వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ‘విరాట్ మైనపు విగ్రహం ఇలాగే పాడవుతోంది..’ అంటూ ఓ నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement