Saturday, May 4, 2024

Shetty: మిస్ వ‌ర‌ల్డ్ పై సినీ శెట్టి క‌న్ను ..

అందాల పోటీలో నెగ్గాలంటే మగువలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి. చూడగానే సురుక్కుమనాలి. గుండెల్లో గుబులు పుట్టాలి. ట్రెడిషనల్ గా కనిపిస్తూనే వేడెక్కించే అందాలతో మైమరిపించాలి. అందం చందంతో పాటు తెలివితేటలు కామన్ గా ఉండాలి. టైమింగ్ సెన్స్.. హ్యూమర్ సెన్స్ ఇంటెలిజెన్స్ సహా ఇంకా ఇన్నర్ క్వాలిటీస్ చాలా కావాలి.. ఇవన్నీ ఉంటేనే మిస్ వరల్డ్ పోటీలో నెగ్గడం సాధ్యమవుతుంది. కనీసం మిస్ ఇండియా అవ్వాలన్నా ఇలాంటి చాలా క్వాలిటీస్ ఉండాలి. అవన్నీ మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్‌ను గెలుచుకున్న సినీ శెట్టిలో పుష్కలంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

మిస్ శెట్టి కూడా అనుష్క శెట్టి వచ్చిన బెంగళూరు పరిసరాల నుంచే పోటీబరిలోకి వెళుతోంది. మిస్ వరల్డ్ 2024లో తన పేరు హాట్ ఫేవరెట్ కానుంది. ఇప్పుడు మిస్ వరల్డ్ 2024 పోటీలలో పాల్గొంటున్న శెట్టి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే డీప్ గా వివరాల్లోకి వెళ్లాలి. ఫెమినా మిస్ ఇండియా 2022 గ్రాండ్ ఫైనల్స్‌లో కర్ణాటకకు చెందిన సినీ శెట్టి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్ విజేతగా ఎంపికైంది. ఈ బ్యూటీ 2000 సంవత్సరంలో ముంబైలో జన్మించింది. అయితే ఈ బ్యూటీ సొంత రాష్ట్రం కర్ణాటక. ముంబైలోని సెయింట్ డొమినిక్ సావియో విద్యాలయ నుండి ఉన్నత పాఠశాల డిప్లొమాతో పట్టభద్రురాలైంది. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో సినీశెట్టి బ్యాచిలర్ డిగ్రీని సంపాదించింది.

జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన నాటి వేడుకలో సినీశెట్టి మిస్ ఇంటియా టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు మిస్ వరల్డ్ 2024 పోటీలు కూడా ఇదే కన్వెషన్ సెంటర్ లో జరుగనున్నాయి. అయితే ఈ పోటీలకు వెళుతున్నందున తాను ఒత్తిడికి గురి కాలేదని సినీశెట్టి అంది. మిస్ ఇండియాగా పోటీలో పాల్గొన్న అనుభవం తనకు ఉపకరిస్తుందని కూడా తెలిపింది.
సినీ శెట్టి ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. బరువు సుమారు 54 కిలోలు. నల్లని కళ్ళు- గోధుమ రంగు జుట్టుతో శెట్టి అందానికి ప్రతిరూపంగా మెరిసిపోతోంది. శెట్టి శరీర కొలతలు 31-25-35 అయితే ఆమె షూ పరిమాణం 8.5(US). శెట్టి అందమైన మనోహరమైన చిరునవ్వు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సారి మిస్ వ‌ర‌ల్డ్ గెలుచుకుంటాన‌నే ధీమాతో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement