Saturday, April 13, 2024

Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు – తొమ్మిది మంది స‌జీవ ద‌హ‌నం

త‌మిళ‌నాడు – బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద సంఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూరు బ్లాక్ లోని ముత్తు సామి పురం గ్రామంలో చోటు చేసుకుంది.


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఓ ప్రైవేట్ బాణాసంచా తయారీ కర్మాగారంలో మంటలు అంటుకుని ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న 9మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలున్నారు. అలాగే మరి కొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సర్వీస్ వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement