Saturday, May 11, 2024

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెద్ద మనసు

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెద్ద మనస్సు చాటుకున్నాడు. తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి 2.5 కోట్ల విలువ చేసే వైద్య పరికరాలు సమకూర్చాడు. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ చూపడంతో జిల్లా ఆసుపత్రిలో 120 ఐసీయూ బెడ్స్ ఏర్పాటుకు యువరాజ్ సింగ్ ముందుకొచ్చాడు. ఈ బెడ్లను కలెక్టర్ నారాయణ రెడ్డి బుధవారం ప్రారంభించగా.. వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో యువరాజ్ పాల్గొన్నాడు.

కాగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి దేశ స్దాయిలో గుర్తింపు సాధించింది. కోవిడ్ సమయంలో కరోనా పేషెంట్లకు వైద్య సిబ్బంది చేసిన సేవలను క్రికెటర్ యువరాజ్ సింగ్ గుర్తించాడు. మరింత మెరుగైన వైద్యం అందిచేందుకు వీలుగా తన ఫౌండేషన్ తరపున రూ.2.5 కోట్లు విలువ చేసే 120 ఐసీయూ బెడ్లను అందచేశాడు. ఈ మేరకు యూవీకేన్ ఫౌండేషన్ సభ్యులు జిల్లా ఆసుపత్రిలోని రెండు వార్డులలో ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ చాలామంది జీవితాల్లో చీకట్లు నింపిందని.. థర్డ్‌వేవ్‌లో అలాంటి విపత్కర పరిస్థితులు రావొద్దనే తన ఫౌండేషన్‌తో ఈ బెడ్స్ ఏర్పాటు చేసినట్లు యువరాజ్ చెప్పాడు.

ఈ వార్త కూడా చదవండి: గుడ్లు, బ్రెడ్లు అమ్ముతున్న సోనూసూద్

Advertisement

తాజా వార్తలు

Advertisement