Tuesday, April 23, 2024

బ్రహ్మాకుమారీస్‌.. సరియైన సమయానికి సరియైన మనసుతో నిద్రించుట

సరిగ్గా లేచుటకు మానసిక శారీరక చురుకుదనం కలుగుటకు మనం టైంకు నిద్రించాలి. నిద్రపైన ఎంత విజయం సాధించగలిగితే అంత మంచిది. రాత్రరి నిద్రించే సమయం 10 గంటల సమయం ఒక ఆదర్శమైన సమయము. ఈ సమయంలో నిద్రించిన వారు ఉదయం 3.30 లేక 4 గంటలకు తేలికగా లేవగలరు. ఆ సమయంలోని ఏకాంతమైన, శాంతమయమైన సతోగుణీ వాతావరణంలో యోగాభ్యాసము మరియు భగవంతుని కలయిక యొక్క ఆనందాన్ని పొందగలరు. ఒక వేళ ఎవరైనా 10 గంటలు తరువాత లేటుగా నిద్రపోతే ఉదయం లేటుగా నన్నా లేస్తాడు. లేకపోతే రోజంతా అలసట, నిద్ర, సోమరితనం, భారం భారంగా ఉన్నట్లనిపిస్తుంది. దీని ప్రభావం అతని దినచర్య మొత్తం మీద పడుతుంది. కావున తన దినచర్య పునాదిని సరిగా చేసికొనుట అవసరం.

రాత్రి నిద్రించే ముందు మానసిక తయారీ కూడా మనం జ్ఞానానుకూలంగానే చేసికొనాలి. నిదురించే పాన్పుపై కూర్చుని ముందు మనం కొద్దిసేపు శివబాబా యొక్క మధుర స్మతి అభ్యాసం చేయాలి. ఒక వేళ మనవద్ద ఎక్కువ సమయం లేకపోయినా, అలసటగా అనిపించినా కూడా అయిదు నిమిషాలైనా సరే ఈశ్వరీయ స్మృతిలో తప్పకుండా కూర్చొనాలి. మంచం మీద వలిపోయి పడిపోవడం ఇది యోగికి తగిన చర్య కాదు. యోగి ముందు తన బిస్తరును సరిచేసకొని చేతులు, కాళ్ళు, ముఖము కడుక్కుని తరువాతనే పరుపుపై కూర్చొంటాడు. అతి సహజంగా మాతా పిత పరమ ప్రియుని రూపంలో పమాత్మునితో మానసికంగా కలుసుకొంటూ ఈ స్థూల లోకంలో నిద్రించుటకు ముందు తనను తాను సూక్ష్మమైన ప్రకాశమయ లోకానికి తీసుకొని వెళ్ళుతాడు. తన స్వరూపమును, ప్రభు చింతనను చేస్తూ ఆ పరమ పిత పరమాత్మతో ఆజ్ఞను తీసి కొని ఆత్మిక స్థితిలో నిద్రిస్తాడు. అనగా అతడు తన కర్మేంద్రియాలనే నౌకరు- చాకర్లకు విశ్రాంతి కోసం సెలవు ఇస్తాడు. మరియు స్వయం నిస్సంకల్ప స్థితిలో నిలిచిపోతాడు. ఈవిధంగా నిద్రించుటకు ముందు యోగినిద్ర కూడా సత్వగుణంతో యోగ నిద్రగా వుంటుంది. తమోగుణ స్వప్నాలు రావు. ఆయన సత్యయుగ పావన సృష్టిలో సూక్ష్మ దేవలోకం యొక్క లేక పురుషోత్తమ సంగమయుగ జ్ఞాన జగత్తులో స్వప్నాలే చూస్తాడు. ఏ సమయంలో లేవాలని సంకల్పం చేసి నిద్రిస్తాడో ఆ సమయానికే అతడు మేల్కొంటాడు.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement