Friday, April 26, 2024

వైఎస్ వివేకా హత్య కేసు.. దర్యాప్తు ముమ్మరం..

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల కోర్టులో తులసమ్మ వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో మరో ఆరుగురిని కూడా సీబీఐ విచారించాలని తులసమ్మ కోరారు. వివేకా హత్య కేసును పలు అంశాలు ప్రభావితం చేశాయని ఆమె పేర్కొన్నారు.

ఈకేసులో అసలు నేరస్థులను తప్పించి అమాయకులను వేధిస్తున్నారని తులసమ్మ ఆరోపించారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివప్రకాశ్ రెడ్డి, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్ ను సీబీఐ విచారించేలా ఆదేశించాలని వెల్లడించారు. తులసమ్మ పిటిషన్ పై తొమ్మిది నెలల తర్వాత వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అనంతరం తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 24కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement