Thursday, March 9, 2023

బీసీ ద్రోహి వైఎస్ జ‌గ‌న్ .. అచ్చెన్నాయుడు

సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రూ.34వేల కోట్ల బీసీ నిధులను జగన్‌రెడ్డి దారి మళ్లించారన్నారు. స్థానిక సంస్థల్లో 10శాతం రిజర్వేషన్లు కోత కోసి.. 16,800 రాజ్యాంగ బద్ధ పదవులను బీసీలకు దూరం చేశారు. బీసీలకు విదేశీ విద్య, పెళ్లి కానుకలు రద్దు చేశారు. జీవో 217తో మత్స్యకారుల వృత్తికి ఉరితాడు బిగించారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. 8వేల ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. 26 మంది బీసీ నేతలను హత్య చేశారు.. 650 మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement