Thursday, November 14, 2024

ఇంట్లో కలహాలతో యువకుడు ఆత్మహత్య..

కరీంనగర్, (ప్ర‌భ‌న్యూస్): మానకొండూర్ మండలం వెల్డీ గ్రామానికి చెందిన కనకం వంశీ అనే యువకుడు (వయసు 22) తన తండ్రితో గొడవ పడి తన సొంత గ్రామం వదిలి కరీంనగర్ పట్టణంలో నివసించడానికి తన తల్లి మరియు తమ్ముడితో కలిసి మూడు రోజుల క్రితం కరీంనగర్ వచ్చాడు. వచ్చేముందు తన తండ్రి శంకరయ్యతో గొడవపడి కరీంనగర్ కి వచ్చి గోదాం గడ్డలో ఇల్లు కిరాయి తీసుకుని ఉంటున్నాడు. యువకుడు బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు, తనకి గతంలో కరీంనగర్ ఐటీ కాంట్రాక్టులో ఉద్యోగం ఉండేది.

సాలరీ నచ్చక ఉద్యోగం వదిలేసి మరో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో కుటుంబ కలహాలతో గొడవపడి ఆదివారం రోజున ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కరీంనగర్ టూ పెద్దపల్లి రైల్వే జంక్షన్ మధ్యలో కరీంనగర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో గుంటూరు పల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను చనిపోయే ముందు అతని తమ్ముడికి ఫోన్ చేసి వివరాలు తెలిపినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement