Monday, April 29, 2024

America: అమెరికా వీసాకు ఆగాల్సిందే.. విజిటర్‌ వీసా కోసం 500 రోజుల టైమ్​

అమెరికా విజిట్‌ వీసాఅపాయింట్‌మెంట్‌ పొందాలంటే 2024 వరకు వేచివుండాల్సిందే. యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం, సగటు నిరీక్షణ సమయం దాదాపు 500 రోజులుగా ఉంది. ఎవరైనా ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే వారికి 2024 మార్చి-ఏప్రిల్‌లో అపాయింట్‌ లభిస్తుంది. న్యూఢిల్లిలోని యూఎస్‌ కాన్సులేట్‌లో వీసా అపాయింట్‌ మెంట్‌ విజిటర్‌ వీసాలకు 522 రోజులు, విద్యార్థి వీసాలకు 471 రోజులు నిరీక్ష ణ వ్యవధిగా చూపుతోంది. లొకేషన్‌ను ముంబైకి మార్చి పరిశీలిస్తే, విజిటర్‌ వీసాకోసం 517 రోజులు, విద్యార్థి వీసా అపాయింట్‌ మెంట్‌కు 10 రోజులు వేచివుండాలని వెబ్‌సైట్‌ను బట్టి తెలుస్తోంది.ఇతర నాన్‌-ఇమ్మిగ్రేషన్‌ వీసాలు ఢిల్లి నుంచి 198 రోజులు, ముంబై నుంచి 72 రోజుల నిరీక్షణ సమయంతో ఉన్నాయి.

యూఎస్‌ ఎంబసీ లేదా కాన్సులేట్‌లో ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ని స్వీకరించడానికి అంచనా వేయబడిన నిరీక్షణ సమయం వారానికోసారి మారవచ్చు. వాస్తవ ఇన్‌కమింగ్‌ వర్క్‌లోడ్‌, స్టాఫ్‌ను బట్టి ఆధారపడివుంటుంది. ఇవి కేవలం అంచనాలు మాత్రమేనని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లోని వీసా పేజీ స్పష్టంచేస్తోంది. జాప్యాల గురించి వచ్చిన నివేదికలపై యూఎస్‌ రాయబార కార్యాలయం స్పందిస్తూ, ఇమ్మిగ్రెంట్‌ , నాన్‌ -ఇమ్మిగ్రెంట్‌ ప్రయాణికుల కోసం యూఎస్‌కి చట్టబద్ధమైన ప్రయాణాన్ని సులభతరం చేయడానికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ కట్టుబడి ఉందని తెలిపింది. కరోనా తర్వాత క్రమంగా సిబ్బంది సంఖ్య పెరుగుతోంది.

అధికారుల నియామకాన్ని అమెరికా గతేడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరం రెట్టింపు చేసింది. ఉద్యోగులు భారతదేశంతో సహా విదేశీ కాన్సులర్‌ న్యాయనిర్ణేత స్థానాలకు చేరుకుంటారని యూఎస్‌ రాయబార కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌ నుంచి వస్తున్న వీసా దరఖాస్తుల సంఖ్యలో గణనీయ పెరుగుదల ఉందని, తుది నిర్ణయం రాయబార కార్యాలయానిదేనని వీసా సులభతర సంస్థ వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ తెలిపింది. మరోవైపు కెనడా వీసాల జారీలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్త విద్యాసంవత్సరంలో అడ్మిషన్లకు వెళ్లాల్సిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇమ్మిగ్రేషన్‌ స్టాండింగ్‌ కమిటీ నివేదిక ప్రకారం గతేడాది భారత్‌ కు చెందిన41 శాతం స్టడీ పర్మిట్‌ దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. కెనడాలో క్రపస్తుతం 2.4 మిలియన్ల కంటే ఎక్కువ ఇమ్మిగ్రేషన్‌ అప్లికేషన్లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement