Sunday, May 5, 2024

మీరు స్వేచ్ఛ‌గా కలలు కనండి… వాటి సహకారానికి నేనున్నాను : ప్రధాని మోడీ

శ్రీకాకుళం : మీరు స్వేచ్ఛ‌గా కలలు కనండి వాటి సహకారానికి నేనున్నాను అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి భరోసా కల్పించారు. కోవిడ్ లో తల్లితండ్రులను కోల్పోయి, నిరాదరణకు గురైన బాలలను ఉద్దేశించి బాలలకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా అందించే సంక్షేమ పథకాల గూర్చి ప్రధాన మంత్రి వర్చువల్ విధానంలో సోమవారం ప్రసంగించారు. జిల్లా నుండి ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి విశ్వేశ్వరతుడు, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, శాసన మండలి సభ్యులు పీబీఎన్ మాధవ్ శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. తల్లి దండ్రులు కోల్పోయినా మీకు ఓదార్చడం ఎవ్వరి తరం కాదన్నారు. అటువంటి పిల్లలకు మానసికంగా సిద్ధం చేయాలని అందుకు సహకారం అందించాలనే లక్ష్యంతో పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.
కార్యక్రమం అనంతరం కేంద్ర జలశక్తి, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి విశ్వేశ్వరతుడు మాట్లాడుతూ.. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని భారత ప్రధాని 2021 మే 29న ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమయంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా జీవించి ఉన్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడం ఈ పథకం లక్ష్యమని, 11 మార్చి, 2020 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 28, 2022తో ముగిసిందన్నారు. ఈ పథకం లక్ష్యం పిల్లల సమగ్ర సంరక్షణ, రక్షణను సుస్థిర పద్ధతిలో నిర్ధారించడం, ఆరోగ్య భీమా ద్వారా వారి శ్రేయస్సును అందించడం, విద్య ద్వారా వారిని శక్తివంతం చేసి వారిని సన్నద్ధం చేయడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు గార్డెన్ గా ఉంటాయన్నారు. ఏ సమస్య వచ్చినా తెలియజేయాలని చెప్పారు. సమస్యలు గ్రీవెన్స్ కు తెలియజేస్తే 15 రోజులు లేదా నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. వెబ్ సైట్ ద్వారా సమస్యలు తెలియజేయాజేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాధిక, సమగ్ర గిరిజనాభివృది సంస్థ పీవో బీ.నవ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మీనాక్షి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కమల, ఐసీడీఎస్ పీడీ అనంతలక్ష్మి, తల్లి దండ్రులు కోల్పోయిన పిల్లలు వారి సంరక్షకులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement