Friday, May 17, 2024

వావ్.. తలకిందులుగా నడుస్తూ కారు లాగిన వ్యక్తి

మరికొన్నిరోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు అభ్య‌ర్థులు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంద‌రు ఓట‌ర్ల ఇంటికి వెళ్లి బ‌ట్ట‌లు ఉతుకుతుంటే, మ‌రికొందరు చిన్న‌పిల్ల‌ల‌కు స్నానం చేయిస్తున్నారు. త‌మ నేతల త‌ర‌ఫున కార్య‌క‌ర్త‌లు కూడా జ‌నాల‌ను ఆక‌ర్షించ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఆర్ఎస్ పురంలో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అన్నాడీఎంకే అభ్య‌ర్థి, రాష్ట్ర మంత్రి ఎస్‌పీ వేలుమ‌ణికి మ‌ద్ద‌తుగా ఓ యోగా టీచ‌ర్ కారు లాగాడు. మామూలుగా కాదు.. త‌ల‌కిందులుగా న‌డుస్తూ న‌డుము, కారుకి మ‌ధ్య చైను కట్టుకుని ఆ వాహ‌నాన్ని లాగాడు. దీని వ‌ల్ల త‌న అభిమాన నేతకు ప్ర‌చారంతో పాటు యోగా‌పై కూడా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించవ‌చ్చ‌ని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement