Monday, May 6, 2024

‘అమర్‌రాజా’ది రాజకీయ సమస్య కాదు.. కాలుష్య సమస్య: రోజా

అమర్‌రాజా కంపెనీ వ్యవహారంలో టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ విషయంలో కావాలనే ప్రతిపక్ష టీడీపీ విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. అమర్‌రాజా కంపెనీది రాజకీయ సమస్య కాదని.. కాలుష్యం సమస్య అని స్పష్టం చేశారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విషయంలో చంద్రబాబు ఏం మాట్లాడారని రోజా ప్రశ్నించారు. ఏపీలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇస్తే.. పచ్చ బ్యాచ్ మాత్రం అమర రాజా గురించే మాట్లాడడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

అమర్‌రాజా కంపెనీ వల్ల గాలి, నీరు, భూమి పూర్తిగా కలుషితమైందని, ఈ కంపెనీ అనేక మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని రోజా తీవ్ర విమర్శలు చేశారు. హైకోర్టు ఆదేశాలను శిరసావహించి అమర్‌రాజా కంపెనీ తన తప్పును సరిదిద్దుకోవాలని, తెలంగాణలో కూడా ఎన్ని పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారో తెలుసుకుని మాట్లాడాలని రోజా హితవు పలికారు. రాజకీయ కక్షతో భారతీ సిమెంట్స్ పరిశ్రమపై చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు చాలా సార్లు దాడులు చేయించారని రోజా గుర్తు చేశారు.

ఈ వార్త కూడా చదవండి: భార్య కోసం పోలీస్ కమిషనర్ గెటప్.. జైలు పాలైన వ్యక్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement