Thursday, May 16, 2024

హెచ్ఎండిఏ ఈ-వేలంలో రికార్డు ధర ప‌లికిన గజం భూమి

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని హెచ్ఎండిఏ వేలం పాటలో రికార్డు ధరలు పలికింది. మోకిల సర్వే నెంబర్ 96 లో 165 ఎకరాలలో 50 హెచ్ఎండిఏ ప్లాట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన హెచ్ఎండిఏ ఈ వేలం పాటలో ప్లాట్ల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. గజం భూమికి 25 వేల రూపాయలు ప్రభుత్వం నిర్ణయించగా. అత్యధికంగా 1,05,000 వరకు గజం విలువ పలికి హెచ్ఎండిఏ కు కాసుల పంట కురిపించింది. 72 వేల రూపాయలు అతి తక్కువగా దరగా నమోదయింది.

ప్రభుత్వ అంచనాకు కొన్ని ప్లాట్ లలో మూడు రెట్లు.. మరికొన్ని ప్లాట్ లలో నాలుగు రెట్ల ధరలు పలకడం జరిగింది. ఆన్లైన్లో జరిగిన ఈ వేలం పాట ఆసక్తికరంగా కొనసాగుతూ చివరకు 1,05000 రూపాయలు గజంకు ధర పలికింది. ఈ భారీ ఈ వేలం పాట ద్వారా 50 ప్లాట్లకు గాను 121.40 కోట్ల రూపాయలు ఆదాయం చేకూరినట్లు అయింది. కోకాపేట్ తర్వాత మోకిల అత్యధిక ధర పలకడం తో రియల్ ఎస్టేట్ ఊపు మళ్లీ ప్రారంభమవుతుందని అందరూ అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తం మీద శంకర్పల్లి మండలంలోని మోకిలలో హెచ్ఎండిఏ వారి ఈ యాక్షన్ అంచనాలకు మించి ధర పలకడంతో ప్రభుత్వానికి కాసుల పంట పండినట్లే

Advertisement

తాజా వార్తలు

Advertisement