Tuesday, May 21, 2024

మంచి టీమ్ ఎంచుకున్నాం కాని..

WTC ఫైన‌ల్లో ఓటమి త‌ర్వాత తుది జ‌ట్టు ఎంపిక‌ను డిఫెండ్ చేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. బెస్ట్ కాంబినేష‌న్‌తోనే బ‌రిలోకి దిగామ‌ని చెప్పాడు. మ్యాచ్ ప్రారంభం కావ‌డానికి ఒక‌రోజు ముందే ఇండియా టీమ్‌ను ప్ర‌క‌టించింది. అయితే తొలి రోజు వ‌ర్షం కార‌ణంగా టాస్ కూడా ప‌డ‌లేదు. వ‌ర్షం వ‌ల్ల అక్క‌డి ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాస్ వేసే ముందు వ‌ర‌కూ తుది జ‌ట్టులో మార్పులు చేసే అవ‌కాశం ఉంటుంది. అయినా కూడా ముందుగా ప్ర‌క‌టించిన టీమ్‌తోనే కోహ్లిసేన బ‌రిలోకి దిగింది. దీనిపై విశ్లేష‌కులు ఆశ్చ‌ర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి కండిష‌న్స్‌లో ఇద్ద‌రు స్పిన్నర్ల‌ను తీసుకొని కోహ్లి త‌ప్పు చేశాడా అన్న సందేహాలు వ్య‌క్తమ‌య్యాయి.

చివ‌రికి ఊహించిందే జ‌రిగింది. న‌లుగురు పేస‌ర్ల‌తోనే బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్‌.. ఇండియ‌న్ లైన‌ప్‌ను రెండుసార్లు ఆలౌట్ చేయ‌గ‌లిగింది. అదే స‌మ‌యంలో భార‌త బౌల‌ర్లు మాత్రం పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. స్టార్ బౌల‌ర్ బుమ్రా అయితే దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. అయితే తాము మాత్రం అందుబాటులో ఉన్న బెస్ట్ టీమ్‌తోనే బ‌రిలోకి దిగామ‌ని కోహ్లి అన్నాడు. ఈ కాంబినేష‌న్‌తోనే వివిధ కండిష‌న్ల‌లో మేము విజ‌యం సాధించాం. ఇదే బెస్ట్ కాంబినేష‌న్ అని భావించాం. టెయిలెండ‌ర్ల వ‌ర‌కూ బ్యాటింగ్ ఉంది. అయితే గేమ్‌లో మ‌రింత స‌మ‌యం ఉండి ఉంటే స్పిన్న‌ర్లు ప్ర‌భావం చూపించేవారు అని కోహ్లి చెప్పాడు.

 ఇక కీవిస్ ని అభినందించాడు విరట్..‘కేన్‌ బృందానికి నా అభినందనలు. ఆటలో నిలకడ, పట్టుదల చూపించిన కివీస్‌ విజయాన్నందుకుంది. మాపై మొదటి నుంచి ఒత్తిడి పెంచిన ప్రత్యర్థికే గెలిచే అర్హత ఉంది. చివరి రోజు వారి బౌలర్లు తమ ప్రణాళికలు పక్కాగా అమలు చేశారు. మేం మరో 30–40 పరుగులు చేయాల్సింది. నలుగురు పేసర్లను తీసుకోవాలంటే అందులో ఒకరు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయి ఉండాలి. అయినా ఇదే జట్టు ఇప్పటి వరకు భిన్న పరిస్థితుల్లో బాగా ఆడింది. ఆట ఇంకొంచెం ఎక్కువ సేపు సాగి ఉంటే స్పిన్నర్లు ఇంకా ప్రభావం చూపించేవారు. ఈ ఫలితం టెస్టు క్రికెట్‌కు మేలు చేస్తుంది. క్రికెట్‌కు గుండెచప్పుడులాంటి టెస్టులకు మరింత ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉంది’ అని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement