Tuesday, May 21, 2024

తొలిసారి యాడ్ లో నటిస్తోన్న బాలకృష్ణ ..కృతజ్ఞతలు తెలిపిన శ్రేయాస్ మీడియా

ఓ వైపు సినిమాలు..మరో వైపు హోస్ట్ గా బిజీగా ఉన్నారు హీరో బాలకృష్ణ ..అయితే ఇప్పటి వరకు తన కెరియర్ లో బాలయ్య యాడ్స్ లలో నటించలేదు. కాగా తాజాగా బాలయ్య తన కెరీర్‌లో తొలిసారి ఓ కమర్షియల్ యాడ్‌లో కనిపించబోతున్నారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సాయిప్రియ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం తెరకెక్కించే ఓ యాడ్‌లో బాలయ్య తొలిసారి కనిపించబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక యాడ్ రంగంలోకి తొలి అడుగు పెడుతున్న బాలయ్యకు ఈ సందర్భంగా శ్రేయాస్ మీడియా కృతజ్ఞతలు తెలిపింది.మొత్తానికి బాలయ్య సినిమాలు, హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ టాక్ షోలతో పాటు తాజాగా యాడ్ రంగంలోనూ అడుగుపెడుతుండటంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ బాలయ్య తన సత్తా చాటుతుండటంతో అభిమానులు గర్వంతో కాలర్ ఎగరేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement