Friday, May 3, 2024

India | మరో రెండ్రోజుల్లో మహిళల టీ 20 ప్రపంచకప్.. ఉత్సాహంతో ఉన్న టీమిండియా అమ్మాయిలు

ప్రతిష్టాత్మక మహిళల టీ 20 ప్రపంచకప్‌ ఇంకో రెండురోజుల్లో మొదలవనుంది. ఇక జూనియర్‌ అమ్మాయిల్లానే సీనియర్లు కూడా కప్పు కొట్టాలని కసితో ఉన్నారు. గత టీ 20 ప్రపంచకప్‌లో కప్పునకు అడుగు దూరంలో నిలిచిపోయిన టీమ్‌ ఇండియా ఈ సారి ట్రోఫీ అందుకోవాలంటే ఈ ప్లేయర్స్‌ రాణించడం ఎంతో అవసరం.

ఆశలన్నీ ఈ ఓపెనర్‌పైనే.
కొన్నేళ్లుగా స్థిరంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకమవుతోంది స్మృతి మందాన. గతేడాది 26 ఇన్నింగ్స్‌ల్లో 680 పరుగులు చేసిన ఈ అమ్మాయి కొత్త ఏడాదిలో జరిగిన ముక్కోణపు టీ 20 సిరీస్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 74 పరుగులు చేయడం తప్పించి అనుకున్నంతగా రాణించలేకపోయింది. అయినా ప్రధాన టోర్నీలో జట్టు ఆశలన్నీ ఆమె వైపేనే.

మెరుపు ఇన్నింగ్స్‌
షఫాలీతో కలిసి స్మృతి మందాన మెరుపు ఆరంభాలను ఇస్తే భారత్‌కు సగం భారం దిగిపోయినట్లే. గత ప్రపంచకప్‌లో సత్తా చాటలేకపోయిన మంధాన (4 మ్యాచ్‌లలో 49) ఈ సారి జట్టుకు కప్పు అందించాలన్న పట్టుదలతో ఉంది.

ఓ సంచలనం
మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌. 2017 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఆడిన 171పరుగుల ఇన్నింగ్స్‌ ఓ సంచలనం అని చెప్పాలి. మళ్లిd ఆ స్థాయిలో రాణించకపోయినా హర్మన్‌ హిట్టింగ్‌ మిడి లార్డర్‌లో భారత్‌కు పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఒత్తిడిలో కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేసే సత్తా ఉన్న హర్మన్‌ ప్రపంచకప్‌లో రాణించడం తొలి ప్రపంచకప్‌ ఆశిస్తున్న భారత సీనియర్‌ జట్టుకు అత్యావశ్యకం.

- Advertisement -

అంతర్జాతీయ అనుభవం
అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలవడంలో అటు బ్యాటర్‌గా ఇటు కెప్టెన్‌గా షెఫాలీ వర్మది ద్విపాత్రాభినయం. మూడేళ్ల అంతర్జాతీయ అనుభవాన్ని ఉపయోగించుకున్న షఫాలీ జూనియర్లను సమర్దంగా నడిపించింది. 2020 టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడిన తర్వాత షెఫాలీ అండర్‌ 19 కప్‌ గెలిచి ఆ లోటు తీర్చుకుంది. ఇప్పుడు ఆమె లక్ష్యం సీనియర్ల తరపున కప్‌ గెలవడం. స్మృతితో కలిసి శుభారంభాలు అందించడం ముఖ్యం. అండర్‌ 19 ప్రపంచకప్‌లో టాప్‌ స్కోరర్లలో మూడో స్థానంలో నిలిచిన షెఫాలీ (7 మ్యాచుల్లో 172) ఆరంభంలో చెలరేగితే ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement