Sunday, April 28, 2024

మహిళల హాకీ ప్రపంచకప్.. మలేషియాపై భారత్ విజ‌యం

మహిళల ఆసియా హాకీ 5 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో భారత మహిళల జట్టు ఇవ్వాల (శుక్రవారం) మలేషియాపై 7-2 తేడాతో విజయం సాధించింది. భారత్ తన మొదటి మ్యాచ్‌ను వేగవంతమైన సెట్-ప్లేతో దాడితో ప్రారంభించింది. మ‌లేషియా జ‌ట్టుపై మెద‌టి నుంచే అటాకింగ్ చేస్తూ భార‌త్ ఆడింది.

ఇక మొద‌టి రౌండ్ ముగిసే సమయానికి భారత్ 3-2తో మలేషియాపై ఆధిక్యంలో ఉండ‌గా.. రెండోరౌండ్ లోనూ అదే ఆధిప‌త్యాన్ని కొన‌సాగించింది. 7-2తో విజయం సాధించడంతో గేమ్ ముగించేసింది. ఇక, తదుపరి మ్యాచ్ రేపు (శనివారం) జపాన్‌తో భారత్ తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement