Friday, October 4, 2024

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ఆమోద‌ముద్ర‌…..

న్యూఢిల్లీ – చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది. ఈ మేర‌కు ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. కాగా, ఇటీవల పార్లమెంట్ లోని ఉభయసభలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లు లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం స్థానాలను రిజర్వ్ చేస్తుంది. మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కలిపిస్తుంది. అయితే ఈ బిల్లు 2029 ఎన్నికల్లో అమలులోకి వస్తుందని కేంద్రం ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement